Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆసియా క్రీడల్లో పాక్‌ చరిత్ర.. క్రికెట్‌లో తొలిసారి గోల్డ్‌ మెడల్‌ రేసులోకి!

Pakistan history in Asian Games reaches cricket final for the first time
Advertisement
  • బంగ్లాదేశ్‌పై పాక్‌కు 6 వికెట్ల విజయం
  • 13 ఓవర్లలో 112 పరుగుల లక్ష్య ఛేదన
  • 11.3 ఓవర్లలోనే గెలిచిన పాకిస్థాన్‌
  • పాక్‌ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి
  • హృదోయ్‌ 25 బంతుల్లో 42 పరుగులు
Advertisement
ఆసియా క్రీడల్లో పాకిస్థాన్‌ పురుషుల క్రికెట్‌ జట్టు ఫైనల్‌కు చేరింది. వర్షం కారణంగా 13 ఓవర్లకు కుదించిన సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 13 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులు చేసింది. పాకిస్థాన్‌ 11.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

భారీ వర్షాల కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో టాస్‌, మ్యాచ్‌ ప్రారంభం ఆలస్యమైంది. దీంతో ఇరు జట్లకు 13 ఓవర్ల చొప్పున కేటాయించారు. పిచ్‌పై పగుళ్లు ఉండటంతో స్పిన్నర్లకు మంచి సహకారం లభించింది.

బంగ్లాదేశ్‌ ఆరంభంలోనే వరుసగా వికెట్లు కోల్పోయింది. తంజీద్‌ హసన్‌ 7, కెప్టెన్‌ లిటన్‌ దాస్‌ 2, పర్వేజ్‌ హొస్సేన్‌ ఎమోన్‌ 1 పరుగుకే పెవిలియన్‌ చేరారు. సైఫ్‌ హసన్‌ 19 పరుగులు చేశాడు. 45 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో తౌహిద్‌ హృదోయ్‌ జట్టును ఆదుకున్నాడు. 25 బంతుల్లో 42 పరుగులు చేశాడు. ఇందులో 4 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. దీంతో బంగ్లాదేశ్‌ 111 పరుగులు చేయగలిగింది. పాకిస్థాన్‌ బౌలర్లలో సుఫ్యాన్‌ మొకీమ్‌ 3, అరాఫత్‌ మిన్హాస్‌ 2 వికెట్లు తీశారు.

లక్ష్య ఛేదనలో పాకిస్థాన్‌కు కూడా ఆరంభంలో ఎదురుదెబ్బ తగిలింది. సాహిబ్‌జాదా ఫర్హాన్‌ను మహేదీ హసన్‌ రెండో ఓవర్లోనే ఔట్‌ చేశాడు. అయితే మాజ్‌ సదాఖత్‌ 15, ఉస్మాన్‌ ఖాన్‌ 14, సైమ్‌ అయూబ్‌ 21 పరుగులతో స్కోరును ముందుకు నడిపారు. చివర్లో అబ్దుల్‌ సమద్‌ 15 బంతుల్లో 30, హసన్‌ నవాజ్‌ 22 బంతుల్లో 27 పరుగులతో అజేయంగా నిలిచారు. 12వ ఓవర్లో నవాజ్‌ ఫోర్‌తో పాకిస్థాన్‌ విజయాన్ని ఖరారు చేశాడు.

ఇది ఆసియా క్రీడల్లో పాకిస్థాన్‌ పురుషుల క్రికెట్‌ జట్టు ఆడనున్న తొలి ఫైనల్‌. 2010లో కాంస్య పతకం సాధించిన పాక్‌.. ఇప్పుడు స్వర్ణం కోసం బరిలోకి దిగనుంది.
Advertisement
Advertisement
Pakistan Cricket Team
Asian Games
Bangladesh vs Pakistan
Cricket Semi Final
Towhid Hridoy
Sufiyan Muqeem

More Telugu News